logo

చిన్ననీటి వనరులపై చిన్నచూపు...!

వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యాంలు భారీవర్షాలలు, వరదల కారణంగా దుస్థితికి చేరుకున్నాయి.

Published : 24 Mar 2023 02:09 IST

మరమ్మతులకు నోచని చెక్‌డ్యాంలు

పెద్దపంజాణి-మద్దలకుంట మార్గంలోని కౌండిన్యనదిపై ఉన్న చెక్‌డ్యాం వరదలకు కొట్టుకుపోయిన దృశ్యం

పెద్దపంజాణి : వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యాంలు భారీవర్షాలలు, వరదల కారణంగా దుస్థితికి చేరుకున్నాయి. వీటి మరమ్మతులను అధికారులు విస్మరించడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడంలేదు. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో కౌండిన్యనదిపై నిర్మించిన చెక్‌డ్యాంలు నెలల కిందట కొట్టుకుపోయాయి. వీటిని బాగుచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి రైతులకు శాపంగా మారింది. మండలపరిధిలోని కౌండిన్యనదిపై దాదాపు 50చెక్‌డ్యాంలు నిర్మించారు. వీటిలో 20చెక్‌డ్యాంలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగు చేస్తే 500మంది రైతులకు చెందిన వెయి ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

నాడు పుష్కలంగా బోర్లలో నీరు

కౌండిన్యనదిలో నిర్మించిన చెక్‌డ్యాంలతో సమీపంలోని వ్యవసాయబోర్లలో నీరు పుష్కలంగా ఉండేది. అవి కొట్టుకుపోవడంతో నదిలో నీరు నిల్వలేకుండా పోయి బోర్లలో భూగర్భ జలాలు పడిపోయాయి. వాటిని బాగు చేస్తే బాగుంటుంది.

చంద్రశేఖర్‌, రైతు, మద్దలకుంట

ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు

చెక్‌డ్యాంలు వరదలతో దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం. - దేవేందర్‌, జలవనరులశాఖ ఏఈ, పెద్దపంజాణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని