logo

తెదేపా వైపే ప్రజల మొగ్గు

ఇక వైకాపా పనైపోయిందని, ఏపీ ప్రజలు బైబై జగన్‌ అంటున్నా రని, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావడం తథ్యమని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 24 Mar 2023 03:02 IST

వాడవాడలా నేతల సంబరాలు

నగరి: ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నాయకుల సంబరాలు  

పుత్తూరు: ఇక వైకాపా పనైపోయిందని, ఏపీ ప్రజలు బైబై జగన్‌ అంటున్నా రని, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావడం తథ్యమని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపాకు జైకొట్టారన్నారు. కార్వేటినగరం రోడ్డు కూడలిలో నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, జిల్లా బీసీసెల్‌ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి పాల్గొన్నారు.

నగరి: తెదేపా నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి విజయో త్సవాలు నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జి.రమేష్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె.బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి జ్యోతినాయుడు, జిల్లా కార్యదర్శి ఆర్‌.బాలాజీ, మైనారిటీ సెల్‌ కార్యదర్శి ఖాదర్‌, గుణశేఖర్‌, ఎస్సీ సెల్‌ కార్యదర్శి అల్లిముత్తు, అయ్యప్ప, కన్నయ్య, అశోక్‌, ఆర్ముగం, వికే వాసు, చిన్నరాజు పాల్గొన్నారు.

పాలసముద్రం: ఆముదాల పంచాయతీ రంగాపురం క్రాస్‌లో తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త చిట్టిబాబునాయుడు ఆధ్వర్యంలో నాయకులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. నాయకులు బుజ్జి, అరుల్‌నాథన్‌, మణినాయుడు, బొజ్జయ్య, రవినాయుడు, శేఖర్‌ రాజు, సాంబశివం, తంగరాజు పాల్గొన్నారు.

పెనుమూరు: నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు

తవణంపల్లె: తవణంపల్లె, దిగువమాఘం గ్రామాల్లో తెదేపా నాయకులు టపాకాయలు పేల్చి, విజయ సంకేతం చూపారు. పార్టీ మండలాధ్యక్షుడు గాలి దిలీప్‌నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెనుమూరు: అనూరాధ గెలుపు వైకాపాకు గొడ్డలి పెట్టు అని రాష్ట్ర టీఎన్‌టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.లోకనాధనాయుడు అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు ఆధ్వర్యంలో నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి రెడ్డెప్ప, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు ఈశ్వర్‌ ప్రసాద్‌, పీహెచ్‌సీ మాజీ అధ్యక్షుడు పరమేళ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్‌ శ్రీనివాసచౌదరి, జిల్లా తెలుగు యువత కార్యదర్శి గురప్పనాయుడు పాల్గొన్నారు.

పుత్తూరు: నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు

నగరి: పంచుమర్తి అనురాధ విజయం వైకాపాకు చెంప పెట్టు అని తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆర్‌.మీరా ఓ ప్రకటనలో తెలిపారు. యాదమరి: ఎమ్మెల్సీగా అనురాధ విజయం హర్షనీయమని తెదేపా మండల అధ్యక్షుడు మురార్జీయాదవ్‌, ప్రధాన కార్యదర్శి రబీ, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వినాయకం గౌండర్‌, జిల్లా కార్యదర్శి హేమగిరి, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి అమరనాథనాయుడు, నాయకులు పూర్ణచంద్ర, రవి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

తవణంపల్లె: విజయ సంకేతం చూపుతున్న తెలుగు తమ్ముళ్లు

విజయపురం: అనురాధ గెలుపు వైకాపాకు చెంపపెట్టని మండల పార్టీ అధ్యక్షుడు రమేష్‌రాజు విలేకరులతో అన్నారు.పూతలపట్టు:  అనురాధ విజయం సాధించడంతో మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జాతీయ రహదారిపై పెద్దఎత్తున బాణసంచా పేల్చి నినాదాలు చేశారు. మండల కన్వీనర్‌ దొరబాబు పాల్గొన్నారు.

‘జగన్‌రెడ్డి పతనం ప్రారంభమైంది’

చిత్తూరు(జిల్లా పంచాయతీ): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తినాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, మాజీ మేయర్‌ కఠారి హేమలత, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు వారు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే తుగ్లక్‌ పాలనకు రాష్ట్ర ప్రజలు తెరదించబోతున్నారని స్పష్టం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని