logo

కలిసికట్టుగా అక్రమాన్ని అడ్డుకున్నారు

శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడుకండ్రిగ సమీపంలోని సువర్ణముఖినదిలో ఇసుక తవ్వకాల కోసం అక్రమార్కులు ఏర్పాటు చేసిన దారిని స్థానికులంతా కలిసికట్టుగా గురువారం తవ్వేశారు.

Published : 24 Mar 2023 03:02 IST

ఇసుక రవాణాను అడ్డుకుంటున్న స్థానికులు

శ్రీకాళహస్తిగ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడుకండ్రిగ సమీపంలోని సువర్ణముఖినదిలో ఇసుక తవ్వకాల కోసం అక్రమార్కులు ఏర్పాటు చేసిన దారిని స్థానికులంతా కలిసికట్టుగా గురువారం తవ్వేశారు. నది నుంచి పెద్దఎత్తున ఇసుక తరలిస్తుండగా రవాణాను అడ్డుకుని ట్రాక్టర్లను బయటకు పంపారు. జేసీబీతో నదిలోని మట్టిరోడ్డును తొలగించారు. ఇసుక తరలించేందుకు తమకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని, ఇసుక రవాణాదారులు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. అయితే ప్రభుత్వ అధికారులు వచ్చినా తమ ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు వీలులేదని స్థానిక రైతులు తేల్చిచెప్పారు. గత కొన్నేళ్లుగా నదిలో పూర్తిస్థాయిలో ఇసుక తరలిస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయ భూములను బీడుభూములగా మార్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏర్పేడు మండలానికి చెందిన వైకాపా నేత జోక్యం చేసుకుని పోలీసులను సువర్ణముఖి నది వద్దకు పంపారు. నదిలోని రోడ్డును తవ్వేందుకు వీలులేదని స్థానికులకు పోలీసులు హెచ్చరించారు. అయితే అక్రమార్కులు నదిలో రోడ్డును ఏర్పాటు చేసి ఇసుక తరలిస్తున్న సమయంలో స్పందించని పోలీసులు ఇప్పుడు తమను బెదిరించడం తగదని స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని