logo

బాలుడిపై వీధి కుక్కల దాడి

పాకాలలోని కరీంతుల్లాబాద్‌ వద్ద వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు కవీష్‌రాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

Published : 24 Mar 2023 03:02 IST

పాకాల, న్యూస్‌టుడే: పాకాలలోని కరీంతుల్లాబాద్‌ వద్ద వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు కవీష్‌రాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం సాయంత్రం బాలుడు ఇంటి సమీపంలో తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు మీదపడ్డాయి. బాలుడు కేకలు పెడుతున్నా ఛాతీ, కడుపు, కన్ను, వీపుపై కొరికేశాయి. మిగతా పిల్లలు భయంతో తప్పించుకున్నారు. గాయపడిన కవీష్‌రాజ్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని