logo

పరిశోధనలకు ఊతం.. నైపుణ్యాలే లక్ష్యం

విద్యార్థి క్లబ్బులు పరిశోధనలకు బాటలు వేస్తున్నాయి. విభాగాల వారీగా ఏటా జరిగే జాతీయస్థాయి సదస్సులతో భావి ఇంజినీరింగ్‌ విద్యార్థులు మార్గదర్శనం పొందుతున్నారు.

Published : 24 Mar 2023 03:02 IST

భావి ఇంజినీర్లకు తోడ్పాటుగా జాతీయ సదస్సులు

సదస్సులో నమూనా ప్రదర్శిస్తున్న భావి ఇంజినీర్లు

కోట, న్యూస్‌టుడే : విద్యార్థి క్లబ్బులు పరిశోధనలకు బాటలు వేస్తున్నాయి. విభాగాల వారీగా ఏటా జరిగే జాతీయస్థాయి సదస్సులతో భావి ఇంజినీరింగ్‌ విద్యార్థులు మార్గదర్శనం పొందుతున్నారు. మెకానికల్‌ విభాగం ఆధ్వర్యాన మెక్పిడియా, ఈసీఈ విభాగం ఆధ్వర్యన యాక్సియాన్‌, ఈఈఈ ఆధ్వర్యాన ఇన్ప్‌డిరన్‌, సివిల్‌ విభాగం ఆధ్వర్యాన పరిగ్రాహా, కంప్యూటర్‌ సైన్సు ఆధ్వర్యాన టెక్‌వ్యూహా, ఐఅండ్‌ఏడీ విభాగం ఆధ్వర్యాన ఇన్‌పోరియం వంటి పేర్లతో జరిగే సదస్సుల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పలు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన 200 మంది నుంచి 300 మంది విద్యార్థులు హాజరై ఆలోచనలు పంచుకొంటున్నారు. అధునాతన నమూనాల తయారీకి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.


మేధోమథనం జరిగేలా..

అధునాతన పరిశోధనలు చేయాలంటే తప్పనిసరిగా మేధోమథనం జరగాలి. విద్యార్థి క్లబ్బుల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జాతీయ సదస్సులతో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. వారితో కలిసి ఆలోచనలు పంచుకుంటున్నాం. ఈ క్రమంలోనే పరిశోధనలు చేసేందుకు అవసరమైన మార్గనిర్దేశనం, సాంకేతిక తోడ్పాటు అందుతోంది.

పుష్పలత, విద్యార్థిని


ప్రాజెక్టు తయారీకి మార్గదర్శనం

సదస్సులతో ప్రాజెక్టు తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశానికి ఉపయోగపడే పరిశోధనల స్థాయి, వాటి తయారీ సాధ్యమవుతుంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దిక్సూచిగా నిలుస్తాయి. సరికొత్త ఆలోచనలతో పరిశోధనలు చేసేందుకు ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుని ముందడుగు వేసేందుకు మార్గదర్శనం లభిస్తోంది.

హరిప్రసాద్‌, విద్యార్థి, విద్యానగర్‌


అనేక అంశాలపై అవగాహన

ఇంజినీరింగ్‌ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాజెక్టు వర్క్‌, పరిశోధన నమూనాలు సమర్పించాలి. అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన నమూనాలు రూపొందించాలంటే సృజనాత్మకత ఆలోచనలు అవసరం. అందుకు జాతీయ సదస్సులు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. గోడ]పత్రికల ఆవిష్కరణ, పరిశోధనాంశాల ప్రదర్శన, టెక్నికల్‌ క్విజ్‌లు వంటివాటితో అనేక అంశాల్లో విద్యార్థులు భాగస్వాములు అవుతున్నారు.

మొహినుద్దీన్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని