logo

ఇది ప్రజాస్వామ్య విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో స్థానిక తెదేపా కార్యాలయం వద్ద గురువారం నేతలు సంబరాలు చేసుకున్నారు.

Published : 24 Mar 2023 03:02 IST

సూళ్లూరుపేటలో బాణసంచా కాల్చుతున్న నేతలు

సూళ్లూరుపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో స్థానిక తెదేపా కార్యాలయం వద్ద గురువారం నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు, కేకులు పంచారు. పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌, చిట్టేటి పెరుమాళ్‌, వేనాటి జనార్దన్‌రెడ్డి, రమణయ్య, బండారు ఆంజనేయులు, మునిరాజా, వెంకటేశ్వర్లురెడ్డి పాల్గొన్నారు. పెళ్లకూరు : ఇది ప్రజాస్వామ్య విజయమని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి దేవారెడ్డి నాగేంద్రరెడ్డి అన్నారు. బాలాయపల్లి :  స్థానిక తెదేపా కార్యాలయం వద్ద చంద్రబాబు జిందాబాద్‌ తెదేపా వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. టపాకాయలు కాల్చారు. మస్తానయ్య నాయుడు, రాయి సత్యం, దట్టం శ్రీనివాసులు పాల్గొన్నారు. నాయుడుపేట, ఓజిలి: నాయుడుపేట తెదేపా అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెంచయ్యలు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఓజిలి తెదేపా అధ్యక్షులు జి.విజయకుమార్‌ నాయుడు, యూనిట్‌ ఇన్‌ఛార్జి ప్రసాద్‌రావు, మైనార్టీ నాయకులు ఎస్‌కే ఖలీల్‌, మాజీ సర్పంచి వెంకటసుబ్బయ్యలు హర్షం వ్యక్తం చేశారు. గూడూరు గ్రామీణం : అనురాధ ఎంపికకావడం వైకాపాకు గుణపాఠమని పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు తెలిపారు. గమళ్లపాళెంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నేతలతో కలిసి బాణసంచారా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. వరుస విజయాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని