logo

అటవీ ప్రాంతంలో కారుపై దాడి: ప్రాణభయంతో కుప్పం చేరుకున్న దంపతులు

కుప్పం-వేపనపల్లె అటవీ ప్రాంతంలోని గుడుపల్లె మండలం ఓఎన్‌ కొత్తూరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ కారుపై ఇద్దరు యువకులు దాడి చేశారు.

Updated : 26 Mar 2023 09:48 IST

దాడిలో ధ్వంసమైన కారు అద్దం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం-వేపనపల్లె అటవీ ప్రాంతంలోని గుడుపల్లె మండలం ఓఎన్‌ కొత్తూరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ కారుపై ఇద్దరు యువకులు దాడి చేశారు. బాధితుల వివరాల మేరకు.. కుప్పం పట్టణానికి చెందిన దంపతులు కారులో బెంగళూరు వెళ్లి రాత్రికి తిరిగి కుప్పం వస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఇద్దరు యువకులు అటకాయించారు. యువకుల వ్యవహరశైలితో భయపడ్డ దంపతులు కారును ముందుకు నడపడంతో రాళ్లతో కారుపై యువకులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. భయాందోళనకు గురై పగిలిన అద్దాలతో వస్తుండగా ఆ యువకులు కారును ద్విచక్రవాహనంపై వెంబడించారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లె స్థానికులు వారిని గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుడుపల్లె మండలం ఓఎన్‌ కొత్తూరు గ్రామానికి చెందిన రాజశేఖర్‌, అజిత్‌గా స్థానికులు గుర్తించారు. దీనిపై రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని