logo

అధ్యాపకురాలిని మోసం చేసిన సైబర్‌ కేటుగాళ్లు

తిరుపతిలో సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అప్రమత్తమై సైబర్‌ ల్యాబ్‌ పోలీసులను ఆశ్రయించడంతో నేరగాడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేసి నగదు తిరిగి ఇప్పించారు.

Published : 27 Mar 2023 02:04 IST

తిరుపతి(నేరవిభాగం): తిరుపతిలో సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అప్రమత్తమై సైబర్‌ ల్యాబ్‌ పోలీసులను ఆశ్రయించడంతో నేరగాడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేసి నగదు తిరిగి ఇప్పించారు. వివరాలివీ.. తిరుపతికి చెందిన అధ్యాపకురాలు కల్పనకు అనుమానిత ఫోన్‌ నెంబరు నుంచి ఫిబ్రవరి 23న ఓ సమాచారం వచ్చింది. తాను మీ దగ్గర చదువుకున్న విద్యార్థిని అంటూ పరిచయం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తాను ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తానని తక్కువ ధరలకు వస్తువులు లభిస్తున్నందున కొనుగోలు చేసుకోమని చెప్పారు. బెంగళూరు ఆర్మీ క్యాంటీన్‌ నుంచి వస్తువులు పంపిస్తానని నమ్మించి రూ.59 వేలు ఎయిర్‌టెల్‌ మనీ పేమెంట్‌ బ్యాంకు అకౌంట్‌కు జమ యించుకున్నారు. వస్తువులు రాకపోయే సరికి అధ్యాపకురాలు అతనికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. మరికొద్ది సేపటికి స్విచ్ఛాప్‌ చేయడంతో సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించింది. వెంటనే తిరుపతి సైబర్‌ ల్యాబ్‌ పోలీసులను ఆశ్రయించడంతో నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో నమోదు చేసి ఏ అకౌంట్‌కు నగదు బదిలీ అయిందో తెలుసుకుని ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. బ్యాంకు అధికారుల సహకారంతో బాధితురాలి కెనరా బ్యాంకు ఖాతాకు ఆదివారమే రూ.59 వేల నగదు రిఫండ్‌ చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని