logo

పతనమవుతున్న టమోటా ధరలు

మండు వేసవిలో టమోటా ధరలు పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా మార్చి చివరిలో రోజురోజుకు పతనమవుతున్నాయి.

Published : 27 Mar 2023 02:35 IST

మార్కెట్‌లో నిల్వ ఉన్న టమోటా

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మండు వేసవిలో టమోటా ధరలు పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా మార్చి చివరిలో రోజురోజుకు పతనమవుతున్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం 15 కిలోల టమోటా పెట్టె గరిష్ఠ ధర రూ.140, కనిష్ఠంగా రూ.30 పలికింది. ఫిబ్రవరి నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రంలోనూ టమోటా దిగుమతులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి టమోటాకు డిమాండ్‌ పూర్తిగా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేసినా.. పెట్టబడులు కూడా రాక రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వారం క్రితం కురిసిన వడగండ్ల వానకు పుంగనూరు ఉద్యానశాఖ వ్యవసాయ డివిజన్‌ పరిధిలో సుమారుగా 351 ఎకరాల టమోటా పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా ఉద్యానశాఖ ఏడీ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని