logo

టీచర్లను భయపెడితే పిల్లలకు చదువురాదు: యూటీఎఫ్‌

ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పరిరక్షించుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమం చేపడదామని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు అన్నారు.

Updated : 27 Mar 2023 05:15 IST

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు 

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పరిరక్షించుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమం చేపడదామని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు అన్నారు. యూటీఎఫ్‌ జిల్లా కౌన్సెల్‌ సమావేశం ఆదివారం స్థానిక ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం, వారిని భయపెట్టడం ద్వారా విద్యార్థులకు విద్యరాదనే అంశాన్ని విద్యాశాఖాధికారులు గుర్తించుకోవాలన్నారు. పాఠశాలలను అధికారులు పరిశీలించడాన్ని స్వాగతిస్తామని, ఆ సమయాన ఉపాధ్యాయులను భయ భ్రాంతులకు గురిచేయడాన్ని ఖండిస్తునామన్నారు. బోధనేతర కార్యక్రమాలకు ఇచ్చే ప్రాముఖ్యత తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని వాపోయారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీరమణ, సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రఘుపతిరెడ్డి, ఎస్‌ఎస్‌నాయుడు, జిల్లా నాయకులు మునిరత్నం, రెహనాబేగం, దక్షిణామూర్తి, శేఖర్‌, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరెడ్డి, సీఐటీయూ నాయకులు గంగరాజు, చైతన్య, పీడీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, జీవీ రమణ (కుడి వైపు నుంచి)

జిల్లా నూతన కార్యవర్గం

యూటీఎఫ్‌ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నిక పరిశీలకులు శ్రీనివాసరావు, ఎన్నికల అధికారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సోమశేఖర్‌ నాయుడు(ఐరాల), ప్రధాన కార్యదర్శిగా జీవీ రమణ(చిత్తూరు), గౌరవాధ్యక్షుడిగా సుధాకర్‌రెడ్డి(తవణంపల్లె), సహాధ్యక్షులుగా మునిరత్నం(నగరి), రెహానాబేగం(యాదమరి), కోశాధికారిగా ప్రసన్నకుమార్‌(గంగవరం) ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కృష్ణమూర్తి(వి.కోట), జగన్‌మోహన్‌రెడ్డి(చౌడేపల్లె), రెడ్డప్పనాయుడు(పూతలపట్టు), సురేష్‌(కుప్పం), దక్షిణామూర్తి(చిత్తూరు), రూప (కార్వేటినగరం), ఏకాంబరం(ఐరాల), మణిగండన్‌(విజయపురం), ఈశ్వరమహేంద్ర(పులిచెర్ల), ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా పీసీబాబు(గంగవరం), ఐక్య ఉపాధ్యాయ పత్రిక కన్వీనర్‌గా ఎంవీరమణ (పెద్దపంజాణి), అనుబంధ కమిటీల సభ్యులను ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల అధికారి ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని