logo

మహిళల ఆర్థికాభివృద్ధే ముఖ్యమంత్రి ఆశయం

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఆశయంతో సంక్షేమ పథకాల వర్తింపులో వారికి ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ఆర్‌.కె.రోజా పేరర్కొన్నారు.

Published : 27 Mar 2023 02:35 IST

నగరిలో వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కును మహిళలకు అందిస్తున్న మంత్రి ఆర్‌.కె.రోజా

నగరి: మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఆశయంతో సంక్షేమ పథకాల వర్తింపులో వారికి ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ఆర్‌.కె.రోజా పేరర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరి పురపాలక సంఘం, మండలంలో పొదుపు సంఘాలకు చెందిన 14,468 మంది మహిళలకు రూ.15,50,72,299 కేటాయించారన్నారు. సదరు మెగా చెక్కును ఆమె మహిళ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఆర్డీవో సుజన, మెప్మా పీడీ రాధమ్మ, మున్సిపల్‌ ఛైర్మన్‌ నీలమేఘం, కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ భార్గవి, తహసీల్దార్‌ చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీవో చంద్రమౌళి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని