logo

రంకెలేసిన కోడెగిత్తలు

రంకెలేస్తూ దూసుకొస్తున్న కోడెగిత్తల జోరుకు అడ్డు కట్ట వేసేందుకు ప్రయత్నించిన యువత సాహసం... వెరసి పశువుల పండగ కోలాహలంగా సాగింది.

Published : 27 Mar 2023 02:35 IST

ఎద్దును నిలువరించడానికి యువకుల ప్రయత్నం

వెదురుకుప్పం: రంకెలేస్తూ దూసుకొస్తున్న కోడెగిత్తల జోరుకు అడ్డు కట్ట వేసేందుకు ప్రయత్నించిన యువత సాహసం... వెరసి పశువుల పండగ కోలాహలంగా సాగింది. మండల పరిధి పాతగుంటలో ఆదివారం పశువుల పండగను గ్రామస్థులు నిర్వహించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పశువులకు గ్రామస్థులు తగిన సౌకర్యాలు కల్పించారు. యువత తమ సంసిద్ధత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు విడతల వారీగా పశువులను జనంలోకి వదలి పెట్టారు. వేగంగా పరుగులు తీస్తున్న ఎద్దులను నిలువరించడానికి యువత సాహసం చేశారు. ఎద్దుల కిందపడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయ పడడంతో 108లో ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని