logo

సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

మన మూలాలను మనమే కాపాడుకోవాలి.. చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 02:35 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి 

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: మన మూలాలను మనమే కాపాడుకోవాలి.. చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక బైరాగిపట్టెడ ఆర్చీకి సమీపంలోని గిరిజన భవనంలో ఆదివారం శంకర్‌ శాలిని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గిరిజన సాంస్కృతిక, జానపద ప్రదర్శన ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యతోనే మనిషికి సమాజంలో విలువ, గౌరవం లభిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర అన్ని వర్గాల బాలబాలికలు విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టాలన్నారు. వడిత్యా శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ.. 2015లో శంకర్‌ శాలిని ఫౌండేషన్‌ స్థాపించి గిరిజనులకు విద్య, నాగరికత జీవనశైలి నేర్పించడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం సాంస్కృతిక, జానపద ప్రదర్శనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మల్లికార్జున నాయక్‌, గిరిజన సంక్షేమ, సాధికార జిల్లా అధికారి చెన్నయ్య, వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికార అధికారి భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 కళాకారుల నృత్య ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని