logo

వేడుకగా సీతారామలక్ష్మణుల తెప్పోత్సవం

స్థానిక వేదనారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆదివారం సీతారామలక్ష్మణుల తెప్పోత్సవం వేడుకగా నిర్వహించారు.

Published : 27 Mar 2023 02:35 IST

నాగలాపురం, న్యూస్‌టుడే: స్థానిక వేదనారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆదివారం సీతారామలక్ష్మణుల తెప్పోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని రాములవారి మండపంలో తిరుచ్చిపై సర్వాలంకారణ భూషితుడైన శ్రీరాముడు సతీసోదర సమేతంగా సన్నిధి వీధిలో విహరించి ఆలయ పుష్కరణికి చేరుకున్నారు. పుష్కరణిలో సిద్ధంగా ఉన్న తెప్పలపై అయోధ్యాపతి విహరించి సేదతీరారు. అంతకుముందు సూర్యకిరణాలు స్వామిని తాకే సుందరదృశ్యాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తులకు నిరాశకు లోనయ్యారు. రవికాంతులు స్వామిని చేరే అద్భుతానికి ఆటంకం కలిగించేలా సూర్యనారాయణుడు మబ్బుల మాటునే ఆగిపోయాడు. దీంతో భాస్కరతేజాల తీక్షణ క్రమేపీ తగ్గుముఖం పట్టి చీకటి పడటంతో సూర్యబింబాన్ని చూడకనే భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ వేదనారాయణుని దర్శించుకున్నారు. ఏర్పాట్లను తితిదే డిప్యూటీ ఈవో నాగరత్న పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని