logo

అధికారులపై చర్యలు తీసుకోవాలి

మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు చట్టాలను ఉల్లఘించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చిందేపల్లె ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Published : 27 Mar 2023 02:35 IST

పరిశ్రమ వద్ద రోడ్డుపై నిరసన తెలుపుతున్న చిందేపల్లె గ్రామస్థులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు చట్టాలను ఉల్లఘించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చిందేపల్లె ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఎలక్ట్రోస్టీల్‌ పరిశ్రమ సమీపంలోని రహదారి వద్దకు చేరుకుని చిందేపల్లె గ్రామ రోడ్డు పరిరక్షణ కమిటి పేరుతో డిమాండ్‌లను తెలియజేస్తూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన గోడను తక్షణమే తొలగించలన్నారు. పరిశ్రమకు అనుకూలంగా కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసిడింగ్స్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఉద్యమంలో పాల్గొనే కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని పరిశ్రమ హెచ్చరికలు జారీ చేయడం తగదన్నారు. సర్పంచి పెంచలయ్య, రంగయ్య, మహానందరెడ్డి పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు