logo

యథేచ్ఛగా అక్రమ కట్టడం

ఆర్సీ రోడ్డు ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అక్రమ కట్టడం చర్చనీయాంశంగా మారాయి.

Published : 27 Mar 2023 03:25 IST

అధికారులను అడ్డుకున్న వైకాపా నాయకులు

ఈఎస్‌ఐ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేపడుతున్న నిర్మాణం

తిరుపతి(రెవెన్యూ), న్యూస్‌టుడే: ఆర్సీ రోడ్డు ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అక్రమ కట్టడం చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి వరకు ఆ ప్రాంగణంలో చిన్నపాటి పార్కులా చెట్లతో కూడిన పచ్చటి పచ్చిక, ఆర్టీసీ బస్‌షెల్టర్‌, స్థలానికి అనుకునే నగరపాలిక ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయి. తాజాగా ఆ స్థలంలో నిర్మాణాలు జరుగుతుండటంతో అటుగా వెళ్తున్న పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై పలువురు నగరపాలిక, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణ ఆదేశాల మేరకు రెవెన్యూ ఆర్‌ఐ జానీబాషా ఘటన స్థలానికి చేరుకుని నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. చేసేదేమి లేక రెవెన్యూ అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు