logo

ప్రదర్శనలు ఔరా..

ఏ పోటీలో అయినా తాము సిద్ధం అంటూ ముందు వరుసలో ఉండి ప్రతిభ చాటుతున్నారు ఆ విద్యార్థులు.. మండలంలోని గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ పాఠశాల పేరును మండల, జిల్లా స్థాయిలో ఇనుమడింపజేస్తున్నారు.

Updated : 27 Mar 2023 05:09 IST

రాణిస్తున్న విద్యార్థులు

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న హెచ్‌ఎం సుబ్బరాయన్‌, ఉపాధ్యాయుడు కేడీ సారథి(పాత చిత్రం)

న్యూస్‌టుడే, పుత్తూరు: ఏ పోటీలో అయినా తాము సిద్ధం అంటూ ముందు వరుసలో ఉండి ప్రతిభ చాటుతున్నారు ఆ విద్యార్థులు.. మండలంలోని గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ పాఠశాల పేరును మండల, జిల్లా స్థాయిలో ఇనుమడింపజేస్తున్నారు.. ఇటీవల నిర్వహించిన జాతీయ సైన్స్‌ మేళాలోనూ తమ ప్రతిభకు పదును పెట్టి చక్కటి ప్రదర్శలు రూపొందించి ప్రముఖుల నుంచి బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు.


ఎకో ఫ్రెండ్లీ హౌస్‌..

గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని లోహిత ఎకో ఫ్రెండ్లీ హౌస్‌ను సిద్ధం చేసి తన ప్రతిభ చాటింది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడేలా జీవ వైవిధ్య భరిత ఇళ్లను రూపొందించారు. దీన్ని అందరికీ ఆదర్శంగా, అత్యంత ఉపయుక్తంగా తయారు చేశారు. పచ్చటి చెట్లు, కాలుష్య రహిత ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని తన మేథస్సుకు పనిపెట్టి మరీ ఈ వినూత్న ప్రాజెక్టు రూపొందించడం గమనార్హం.


సోలార్‌ వర్కింగ్‌ మోడల్‌..

గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు సంతోష్‌. సౌర కుటుంబాన్ని.. సూర్యుడు మిగిలిన గ్రహాలను వాటి భ్రమణాలను చేసి చూపాడు. గ్రహాల భ్రమణం, సూర్యుడి నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి.. వాటి ఆకారాలు, పరిమాణాలు చాలా చక్కగా చూపి తన ప్రతిభ చాటాడు. తద్వారా పలువురు ప్రముఖులచే ఔరా అనిపించుకున్నాడు. తద్వారా జిల్లా స్థాయిలో అవార్డులు సాధించాడు.


చాలా సంతోషం..

తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాల పేరు ఇనుమడింపజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి తమలో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలి. విద్యార్థులు అందరూ అన్ని రంగాల్లో రాణించేందుకు కృషిచేయాలి.

- సుబ్బరాయన్‌, ప్రధానోపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని