logo

విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలి

విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని మంత్రి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. పట్టణంలోని జ్ఞానజ్యోతి విద్యామందిర్‌లో జరిగిన వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

Published : 27 Mar 2023 03:25 IST

వార్షికోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి ఆర్‌కే రోజా

పుత్తూరు: విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని మంత్రి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. పట్టణంలోని జ్ఞానజ్యోతి విద్యామందిర్‌లో జరిగిన వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. విద్యామందిర్‌ కరస్పాండెంట్‌ దివంగత ప్రకాశ్‌రాజు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రిని పాఠశాల యాజమాన్యం సత్కరించింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ హరి, వైస్‌ ఛైర్మన్‌ జయప్రకాష్‌, డీఈవో శేఖర్‌, ప్రిన్సిపల్‌ హరినాథ్‌రెడ్డి, డైరెక్టర్‌ శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయపురం: మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రోజా పేర్కొన్నారు. ఎండీవో కార్యాలయ ఆవరణలో ఆసరా మూడో విడత నగదు రూ.5.65కోట్లు విలువైన చెక్కును మండలంలోని 635 సంఘాలకు అందజేసి మాట్లాడారు. అనంతరం సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఎంపీడీవో సతీష్‌యాదవ్‌, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటమ్మ, ఏపీఎం రమాదేవి, సీసీలు రజని, సుబ్రహ్మణ్యం, సుధాకర్‌, ఎంపీపీ జమున, వైస్‌ ఎంపీపీ దశరథ, నాయకులు రాజగోపాల్‌యాదవ్‌, సతీష్‌యాద శివరాజ్‌, సర్పంచులు మురళీకృష్ణ, జపమేరి ప్రసన్నకుమార్‌ ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని