logo

ఈ కేంద్రం తెరచుకునేదెన్నడో?

పట్టు పరిశ్రమకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. పట్టుగుడ్ల ఉత్పత్తి, మల్బరీ సాగులో జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, గుర్తింపు జిల్లాకు కరవే.

Published : 30 Mar 2023 02:23 IST

న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ: పట్టు పరిశ్రమకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. పట్టుగుడ్ల ఉత్పత్తి, మల్బరీ సాగులో జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, గుర్తింపు జిల్లాకు కరవే. ఇందుకు నిదర్శనమే చిత్తూరు నగర శివారు ఇరువారంలో మూతపడిన జాతీయ పట్టుగుడ్ల ఉత్పాదన కేంద్రం. కేంద్ర పట్టుమండలి, జాతీయ పట్టుగుడ్ల సంస్థ ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో పట్టు సాగు, పట్టుగుడ్ల ఉత్పత్తిలో జిల్లా అంచెలంచెలుగా ఎదిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకోక పోవడంతో ఆ కేంద్రం క్రమేపీ కనుమరుగవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆ భవన సముదాయాలు నిరుపయోగంగా మారాయి. అక్కడి ఖాళీ స్థలాలు పరుల పాలయ్యాయనేది స్థానికులు, రైతుల ఆరోపణ. ఇప్పటికైనా విలువైన ఆ కేంద్రం భవనాలు, ఖాళీ స్థలాలను ఉపయోగంలోకి తీసుకొచ్చి పట్టు పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
       

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని