logo

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జేసీ వెంకటేశ్వర్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:23 IST

మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జేసీ వెంకటేశ్వర్‌ అన్నారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 115 కేంద్రాల్లో 21,996 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. 11 రూట్లకు 22 మంది అధికారుల్ని నియమించామని, ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటుచేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని