logo

చిత్తూరు-తచ్చూరు రహదారి భూముల స్వాధీనంపై వివాదం

చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారి భూ సేకరణ పూర్తైనా అధిక పరిహారం చెల్లింపు, కోర్టు కేసు వివాదాలతో దిగుమాసాపల్లె పంచాయతీ, అనుపల్లె, మాపాక్షి, నరిగపల్లె,

Published : 30 Mar 2023 02:23 IST

జేసీబీలతో చెట్లు, రేకుల షెడ్లు తొలగిస్తున్న దృశ్యం

చిత్తూరు గ్రామీణ: చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారి భూ సేకరణ పూర్తైనా అధిక పరిహారం చెల్లింపు, కోర్టు కేసు వివాదాలతో దిగుమాసాపల్లె పంచాయతీ, అనుపల్లె, మాపాక్షి, నరిగపల్లె, గంగా సాగరం ప్రాంతాల్లో ఐదు మంది రైతుల భూముల స్వాధీన ప్రక్రియలో బుధవారం వాగ్వాదం నెలకొంది. దిగుమాసాపల్లెకు చెందిన మొగిలి నాయుడు, ఈశ్వరి, గోవర్థన్‌నాయుడు, హేమలత.. తమకు పరిహారం చెల్లించకుండా కోర్టులో ఈ విషయం ఉంటే భూములు ఎలా స్వాధీనం చేసుకుంటారని వాగ్వాదానికి దిగారు. చట్ట ప్రకారం పరిహారం ఇస్తామని, భూ సేకరణ తరవాత.. తగాదాలతో కోర్టుకు వెళ్లి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం సరికాదని తహసీల్దారు కిరణ్‌ కుమార్‌ అన్నారు. సీఐ గంగిరెడ్డి పోలీసులతో భూములు స్వాధీనం చేసుకోవడంతో వారు జేసీని కలిసి విన్నవించారు. గంగాసాగరం వద్ద కృష్ణమ్మ అధికారులను అడ్డుకుని న్యాయం చేయాలని లేకుంటే కలెక్టర్‌కు విన్నవించి న్యాయపోరాటం చేస్తామన్నారు. తాలుకా ఎస్సై రామకృష్ణ, ఎన్‌హెచ్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని