logo

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి

హోమ్‌గార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని కర్నూలు రేంజ్‌ హోమ్‌గార్డు కమాండెంట్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. చిత్తూరులోని హోమ్‌గార్డు యూనిట్‌ను ఆయన బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు.

Published : 30 Mar 2023 02:23 IST

మాట్లాడుతున్న కర్నూలు రేంజ్‌ హోమ్‌గార్డు కమాండెంట్‌ మహేష్‌కుమార్‌

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: హోమ్‌గార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని కర్నూలు రేంజ్‌ హోమ్‌గార్డు కమాండెంట్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. చిత్తూరులోని హోమ్‌గార్డు యూనిట్‌ను ఆయన బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో 661 మంది హోమ్‌గార్డుల్లో.. 227 మంది వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. వీరూ పోలీసులతో సమానమేనని, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ కట్టడి తదితర విధుల్లో చురుగ్గా ఉంటూ మంచిపేరు తీసుకురావాలన్నారు. ఆపై ఆక్సిస్‌ బ్యాంక్‌ ప్రయోజనాలు, వైఎస్‌ఆర్‌ బీమా పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి హోమ్‌గార్డులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకముందు హోమ్‌గార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించి కవాతు పర్యవేక్షించారు. ఏఆర్‌ డీఎస్పీలు మురళీధర్‌, కృష్ణమోహన్‌, తిరుపతి హోమ్‌గార్డు డీఎస్పీ లక్ష్మణ్‌కుమార్‌, ఆర్‌ఐ నీలకంటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని