logo

ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రతి వైద్యసేవ తెలియాలి

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ కేంద్రాల్లో జరిగే వైద్య సేవలు.. రోగికి ఇచ్చే మందులు, పరీక్షల వివరాలు అక్కడి పుస్తకాల్లో నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, చికిత్స పొందుతూ ఎవరైనా

Published : 30 Mar 2023 02:23 IST

రోగికి ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌ వివరాలు తప్పనిసరి

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో ప్రకాశం

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ కేంద్రాల్లో జరిగే వైద్య సేవలు.. రోగికి ఇచ్చే మందులు, పరీక్షల వివరాలు అక్కడి పుస్తకాల్లో నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, చికిత్స పొందుతూ ఎవరైనా మృతి చెందినా ఆ వివరాలు వైద్యారోగ్యశాఖకు తెలియాలని డీఎంహెచ్‌వో ప్రకాశం ఆదేశించారు. అప్పుడే వైద్యం పరంగా ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ఎలాంటి సేవలు మెరుగుపరచాలనేది తెలుస్తుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రి, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వివరాలు జిల్లా యాప్‌లో ఏరోజుకారోజు అప్‌లోడ్‌ కావాలని, తద్వారా జిల్లాలో ఎలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయనేది తెలుస్తుందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు వీటిని పాటిస్తే వ్యాధులు ప్రబలకుండా నియంత్రించే వీలుంటుందన్నారు. జిల్లా టీకాల అధికారి రవిరాజు, మలేరియా అధికారి శ్రీనివాసులు, జిల్లా గణాంకాల అధికారి రమేష్‌రెడ్డి, ఇన్‌ఛార్జి డెమో జయరాముడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని