logo

ప్రయోగం.. ఇదీ ప్రయోజనం

ఇంజినీరింగ్‌ విద్యార్థులు స్మార్టుగా ఆలోచించి పలు ప్రయోగాలను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన

Published : 30 Mar 2023 02:23 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే

ఇంజినీరింగ్‌ విద్యార్థులు స్మార్టుగా ఆలోచించి పలు ప్రయోగాలను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఎలక్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులు స్మార్ట్‌ అటెండెన్స్‌, ఈ-సైకిల్‌ ప్రయోగాలను రూపొందించారు.

హాజరు నమోదు కోసం

ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో హాజరును మాన్యువల్‌గా వేయడం చాలా కష్టం ఉంటుంది. సమయం సరిపోక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను స్మార్ట్‌ అటెండెన్స్‌ పరిష్కరిస్తుందని ఇంజినీరింగ్‌ విద్యార్థులు సుబ్రహ్మణ్యం, మమత, వేలు, తిలక్‌, దివ్య వివరించారు. ఈ విధానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రాక్టికల్స్‌ సమయంలో కచ్చితమైన హాజరు తీసుకోవచ్చు. ప్రత్యక్ష వీడియో స్ట్రీమింగ్‌ ద్వారా హాజరు రికార్డ్‌ చేయొచ్చు. క్లిప్‌ నుంచి చిత్ర ఫ్రేమ్‌లను తీసుకొని ముఖ ల్యాండ్‌మార్క్‌ల అల్గారిథమ్‌ ద్వారా నమోదు చేసుకుంటుందని విద్యార్థులు చెప్పారు.


బ్యాటరీ సైకిల్‌

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంధన, విద్యుత్‌ శక్తి కొరత ఎదుర్కొంటున్నాయి. దేశంలో అధిక శాతం మంది వాహనాలకు అలవాడు పడి, ఇంధన భారం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. వీరికి అనుకూలంగా ఉండేలా ఇంజినీరింగ్‌ విద్యార్థులు స్మార్ట్‌ సైకిల్‌ను రూపొందించారు. ఈ ప్రయోగం ద్వారా సైకిల్‌ తొక్కుతున్నంత సేపు బ్యాటరీ ఫుల్‌ఛార్జి అయ్యి ఒక మోస్తరు దూరం వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఈ బ్యాటరీని తరచూ ఛార్జ్‌ చేయాల్సిన అవసరం సైతం లేదన్నారు. తక్కువ సామర్థ్యంతో ఉన్న బ్యాటరీతో ఈ సైకిల్‌ ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని విద్యార్థులు మమత, వేలు, త్రివేణి, వాసు వివరించారు.


ఫారెస్టు గార్డుతో రక్షణ..

వేసవిలో అడవులు తగలబడి అనేక వన్యప్రాణులు మరణిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తక్షణమే ఫారెస్టు గార్డు ద్వారా అటవీ అధికారులకు సమాచారం ఇస్తుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తారు. దీని ద్వారా పెను ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ పరికరంలో ఉండే వైర్‌లెస్‌ సెన్సార్‌ ద్వారా సమాచారాన్ని సమయానికి చేరవేస్తుందని విద్యార్థులు సుబ్రహ్మణ్యం, సురేంద్ర, హరిక్రిష్ణ, సాయి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని