logo

విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

వైద్య పరీక్షల్లో అవకతవకలపై స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశాల మేరకు డీసీహెచ్‌ఎస్‌ బీసీనాయక్‌ బుధవారం విచారణ చేపట్టారు.

Published : 30 Mar 2023 02:23 IST

డీసీహెచ్‌ఎస్‌ బీసీనాయక్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భరత్‌, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు తదితరులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: వైద్య పరీక్షల్లో అవకతవకలపై స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశాల మేరకు డీసీహెచ్‌ఎస్‌ బీసీనాయక్‌ బుధవారం విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ భరత్‌, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు ఆస్పత్రికి చేరుకొని ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. వసతులున్నా రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఆస్పత్రి పర్యవేక్షణకు తమ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు పర్యవేక్షించకుండా లేఖలు రాయడమేమిటని జడ్పీ ఛైర్మన్‌ అన్నారు. డీసీహెచ్‌ఎస్‌ మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ప్రతి ఒక్కరినీ విచారించి, నివేదికను కలెక్టర్‌కు పంపుతామన్నారు. పురపాలక ఛైర్మన్‌ సుధీర్‌ ఉన్నారు.

నామమాత్రంగా విచారణ

ఆస్పత్రిలో అవకతవకలపై విచారణ కోరుతూ ప్రజావేదిక, ప్రజా సంఘాల ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఆరోగ్య శాఖాధికారులు నామమాత్రంగా విచారణ చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తమ ఎదుట విచారణ చేయకుండా గోప్యంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంఘ నాయకులు మునిరాజు, దేవరాజ్‌, నవీన్‌ తదితరులు ఆరోపించారు. ఈ విచారణపై తమకు నమ్మకం లేదని, కలెక్టర్‌ సమక్షంలో విచారిస్తే ఆధారాలిస్తాన్నారు.  ఆస్పత్రి ఛైర్మన్‌ చంద్రబాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని