logo

అభివృద్ధి పనులకు రూ.8.7 కోట్లు

పురపాలక పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని పురపాలక ఛైర్‌పర్సన్‌ పవిత్ర తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.8.7 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె వివరించారు.

Published : 30 Mar 2023 02:23 IST

మాట్లాడుతున్న పురపాలక ఛైర్‌పర్సన్‌ పవిత్ర

పలమనేరు, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని పురపాలక ఛైర్‌పర్సన్‌ పవిత్ర తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.8.7 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె వివరించారు. బుధవారం పురపాలక సాధారణ సమావేశంలో ఆమె ప్రకటించారు. విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. కాగా గంటావూరు చెరువు వేలం వాయిదా వేయాలని కౌన్సిలర్‌ నాగరాజు సూచించారు. గతంలో కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని సక్రమంగా చెల్లించలేదని, మున్సిపాలిటీకి ఆదాయం తగ్గిపోతోందన్నారు. ఆ అంశాన్ని సభ్యులు సమావేశంలో ఆమోదించకుండా వాయిదా వేశారు. ఇంటి పన్నుల చాటున చెత్తపన్ను కూడా వసూలు చేస్తున్నారని కౌన్సిలర్‌ శారద ఆరోపించారు. గొబ్బిళ్లకోటూరు రోడ్డును రెండేళ్లుగా మరమ్మతు చేయలేదన్నారు. శివాలయం ఎదురుగా తోపుడు బళ్లను తొలగించడం, పట్టణంలో ఫాగింగ్‌, ఎద్దుల సంత రోడ్డుపై ఆక్రమణలను తొలగించడం, అద్దెల వసూలు పూర్తి చేసినట్లు కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. కౌన్సిలర్లు మురళికృష్ణ, మండి సుధాకర్‌, కోదండరామయ్య, బీఆర్సీకుమార్‌, రాగిపాళెంరవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని