logo

విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు

డిగ్రీ మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు మంగళవారం నాటి ‘‘ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌’’ ప్రశ్నపత్రంలో వచ్చిన పాఠ్యాంశేతర ప్రశ్నలకు సంబంధించి బుధవారం ‘ఈనాడు’లో ‘ఆచార్యా..

Published : 30 Mar 2023 02:23 IST

తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: డిగ్రీ మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు మంగళవారం నాటి ‘‘ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌’’ ప్రశ్నపత్రంలో వచ్చిన పాఠ్యాంశేతర ప్రశ్నలకు సంబంధించి బుధవారం ‘ఈనాడు’లో ‘ఆచార్యా.. ఇదేం ప్రశ్నపత్రం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు వీసీ ఆచార్య రాజారెడ్డి పరీక్షల కార్యాలయం అధికారులను పిలిపించుకుని ఆరాతీశారు. పాఠ్యాంశేతర ప్రశ్నలున్నప్పుడు నిబంధనల ప్రకారం విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ అంశంపై వర్సిటీ సీఈ దామ్లానాయక్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ విద్యార్థుల నుంచి రాతపూర్వక ఫిర్యాదు అందగానే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, విద్యార్థులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, బుధవారమే జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రశ్నపత్రంలో వచ్చిన పాఠ్యాంశేతర ప్రశ్నల వివరాలను ఎస్వీయూకు పంపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని