logo

బలవంతంగా దీక్ష భగ్నం

చిందేపల్లె రహదారి కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు బలవంతంగా బుధవారం భగ్నం చేశారు.

Published : 30 Mar 2023 02:22 IST

పోలీసులపై రాళ్లు రువ్విన స్థానికులు
ఆందోళన కారులపై పోలీసుల లాఠీఛార్జి

ఏర్పేడు, న్యూస్‌టుడే: చిందేపల్లె రహదారి కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు బలవంతంగా బుధవారం భగ్నం చేశారు. రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారి నుంచి రాచగున్నేరి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్‌ పరిశ్రమ మీదుగా గ్రామానికి వెళ్లే రహదారికి అడ్డంగా పరిశ్రమ యాజమాన్యం గోడ నిర్మించడంతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామస్థులకు మద్దతుగా వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి చిందేపల్లెలోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి నిరశన దీక్షను చేపట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీస్‌లు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని బలవంతంగా దీక్షను భగ్నం చేసి అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర వాహనంతో పాటు పోలీసు వాహనాలు ముందుకు కదలకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీస్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో గాజులమండ్యం సీఐ ఆరోహణరావు, బీఎన్‌కండ్రిగ ఎఎస్సై శివకుమార్‌ గాయ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు స్థానికులపై లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన కార్యకర్తలు, స్థానికులను పోలీస్‌లు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని