logo

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక తెదేపా

పేదవారికి కూడు, గూడు, గుడ్డ లక్ష్యంగా.. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించి ప్రభంజనం సృష్టించారని పలువురు కొనియాడారు.

Published : 30 Mar 2023 02:22 IST

ఆవిర్భావ దినోత్సవంలో నేతలు

సూళ్లూరుపేటలో వేడుక...

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పేదవారికి కూడు, గూడు, గుడ్డ లక్ష్యంగా.. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించి ప్రభంజనం సృష్టించారని పలువురు కొనియాడారు. బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను వాడవాడలా, పల్లెపల్లెన ఘనంగా నిర్వహించారు. గూడూరులో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీనియర్‌ నేతలను సన్మానించారు. కోట : కోటలో సీనియర్‌ నేతలను సన్మానించారు. తెదేపా తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు జలీల్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చిట్టమూరులో మస్తాన్‌రెడ్డి, కస్తూరయ్య, చెంచురామాచారి, రాజేష్‌రెడ్డి, జనార్దనరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, చిన్నారావు పాల్గొన్నారు. దొరవారిసత్రం : పార్టీ మండల అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకులను సన్మానించారు.

నాయుడుపేటలో...

ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, ఎస్సీ, బీసీ విభాగాల అధ్యక్షులు జకరయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన స్థాయిని మరిచి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెలవల సుబ్రమణ్యంను మాట్లాడటం తగదని  అన్నారు.  తడ : బజారు కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నీలకంఠం, కె.శెల్వం, బొమ్మన పళని, కె.యుగంధర్‌రెడ్డి, సుందరంరెడ్డి, రవి, జైపాల్‌, వాసు, రమేష్‌రెడ్డి, వాసు, దేశప్పన్‌, రామ్మూర్తిరెడ్డి పాల్గొన్నారు. ఓజిలి

(నాయుడుపేట): ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చారని  పార్టీ మండల అధ్యక్షుడు జి.విజయకుమార్‌ నాయుడు తెలిపారు. బస్టాండ్‌ సమీపంలో వేడుకలను నిర్వహించారు. ఉపాధ్యక్షులు డి.శ్రీనివాసులురెడ్డి, కె.ప్రసాద్‌రావు పాల్గొన్నారు. నాయుడుపేట : గడియారంలో సెంటర్‌లో పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. పలువురు నేతలను సన్మానించారు.  సూళ్లూరుపేట: పార్టీ పట్టణ, గ్రామీణ అధ్యక్షులు ఆకుతోట రమేష్‌, కొక్కు శంకరయ్య, నేతలు  వేడుకల్లో పాల్గొన్నారు. బాలాయపల్లి : రాయి మస్తానయ్య నాయుడు, కొర్రపాటి రామచంద్రయ్య నాయుడు, రాయి సత్యం, కూను శ్రీహరి, జి.గోపాలయ్య యాదవ్‌, జడపల్లి కోటి ప్రసంగించారు. వెంకటగిరి: పట్టణాధ్యక్షుడు గంగాధర్‌, నేతలు రాజేశ్వరరావు, సత్యనారాయణ, ప్రసాద్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. వాకాడు : వేడుకల్లో దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు : నాయకులు వెంకటేశ్వర్లురెడ్డి, పట్టాభిరెడ్డి, లీలావతి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

గూడూరు : ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నేతలు

వెంకటగిరిలో  సీనియర్‌ కార్యకర్తలకు సన్మానం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని