logo

తిలాపాపం.. తలా పిడికెడు!

ఎక్కడో ఒక చోట జరిగిన అవినీతి, అక్రమాల పాపాన్ని సర్దుబాటు చేసే క్రమంలో అందరూ తమవంతుగా నగదు సమకూర్చాలన్న ఎస్‌ఈబీ అధికారుల ప్రతిపాదనకు మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు అంతర్మథనానికి గురవుతున్నారు.

Published : 30 Mar 2023 02:22 IST

మద్యం దుకాణ ఉద్యోగుల అంతర్మథనం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఎక్కడో ఒక చోట జరిగిన అవినీతి, అక్రమాల పాపాన్ని సర్దుబాటు చేసే క్రమంలో అందరూ తమవంతుగా నగదు సమకూర్చాలన్న ఎస్‌ఈబీ అధికారుల ప్రతిపాదనకు మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు అంతర్మథనానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లే మార్గంలోని మద్యం దుకాణం సూపర్‌వైజర్‌ చేతివాటంతో మద్యం అమ్మకాలు, స్టాకు నిల్వలకు పొంతన లేకుండా పోయింది. దాదాపుగా రూ.50 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు సమాచారం. ఇటీవల ఎక్సైజ్‌ విభాగం విజిలెన్స్‌ శాఖ అధికారులు దాడులు చేసి నిర్ధారించడం గమనార్హం. దీని వెనుక పెద్దల సహకారం ఉంటుందన్నది అక్షర సత్యం. అయితే ఈ అవినీతి గుట్టు బయటకు పొక్కనీయకుండా సర్దుబాటు చేసేందుకు కొందరు అధికారులు రంగ ప్రవేశం చేశారు. హెచ్‌డీ మద్యం రకం ధరలు పెంచి విక్రయించాలని ఇప్పటికే ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగి రూ.30 వేలు సర్దుబాటు చేయాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. ఒక సూపర్‌వైజర్‌ చేసిన అవినీతి, అక్రమాలకు తామంతా ఎందుకు బాధ్యత వహించాలని మిగిలిన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా సర్దుబాటు చేయడం ఎంత వరకు సమంజసమన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని