logo

ప్రభుత్వ వైఫల్యాలతోనే మహిళలపై దాడులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతోనే పసిపిల్లలు, వివాహితలనే తేడా లేకుండా అత్యాచారాలు, దాడులు, వేధింపులు అధికమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Published : 30 Mar 2023 02:22 IST

చిత్తూరు గ్రామీణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతోనే పసిపిల్లలు, వివాహితలనే తేడా లేకుండా అత్యాచారాలు, దాడులు, వేధింపులు అధికమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని అన్నారు. స్థానిక ఎన్జీవో ప్రాంగణంలో బుధవారం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అధ్యక్షతన జిల్లా సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మహిళల రక్షణకు పెద్దఎత్తున పోరాటాలు చేసిన ఘనత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా చట్టాలు- హక్కుల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్‌, మహిళా సమాఖ్య నాయకులు విజయగౌరీ, జయలక్ష్మి, రమాదేవి, కుమారి, జమిలాబీ, లత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని