logo

సికింద్రాబాద్‌- తిరుపతికి ప్రత్యేక రైళ్లు

రైలు ప్రయాణికుల రద్దీని నివారించడంలో భాగంగా సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే బుధవారం

Published : 30 Mar 2023 02:22 IST

తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: రైలు ప్రయాణికుల రద్దీని నివారించడంలో భాగంగా సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌- తిరుపతి (07489) రైలు ఏప్రిల్‌ 7, 14 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి మరసటిరోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ (07490) రైలు ఏప్రిల్‌ 9, 16 తేదీల్లో తిరుపతి నుంచి సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.35 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్డు, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి స్టేషన్‌కు రాకపోకలు సాగించనున్నాయి. పై రైళ్లలో ఏసీ-2, ఏసీ-3 టైర్‌, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని