logo

ఆన్‌లైన్‌లో రూ. 11.50 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

చంద్రగిరి మండలంలో ఆన్‌లైన్‌లో మోసపోయి ఒకే రోజు రూ.11.50 లక్షలు పొగొట్టుకున్నాడు. పోలీసుల కథనం మేరకు చంద్రగిరి మండలం

Published : 30 Mar 2023 02:22 IST

చంద్రగిరి: చంద్రగిరి మండలంలో ఆన్‌లైన్‌లో మోసపోయి ఒకే రోజు రూ.11.50 లక్షలు పొగొట్టుకున్నాడు. పోలీసుల కథనం మేరకు చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీ మామిడిమానుగడ్డ గ్రామానికి చెందిన కె.వంశి ఇంటివద్దనే ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆన్‌లైన్‌ మెసేజ్‌లో అజ్ఞాత వ్యక్తి సెల్‌ఫోన్‌ నుంచి వంశీ సెల్‌కు హాయ్‌ మెసేజ్ వచ్చింది. చరవాణిలో గూగుల్‌ యాప్‌ద్వారా మ్యాప్‌లో కొన్ని లోకేషన్లు గుర్తిస్తే ఒకటికి రెండింతలు చెల్లిస్తామంటూ మెసేజ్‌ చేశాడు. దీంతో సులభంగా డబ్బులు పొందవచ్చని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వంశీ గూగుల్‌యాప్‌లో లోకేషన్లు షేర్‌ చేయడంతో తొలుత రూ.5 వేలు, తర్వాత రూ.7 వేలు, ఆపైన రూ.19 వేలు, ఇలా విడతల వారీగా ఒకే రోజు రూ.11.50 లక్షలు పొగొట్టుకున్నాడు. తర్వాత మోసపోయామని గ్రహించి చంద్రగిరి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై వంశీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని