logo

సార్వత్రిక పాఠశాలల ప్రశ్నపత్రాలు వచ్చేశాయ్‌

సార్వత్రిక పాఠశాలల్లోని పదో తరగతి, ఇంటర్‌మీడియేట్‌ పరీక్షల ప్రశ్న పత్రాలు గురువారం విజయవాడ నుంచి చిత్తూరుకు పోలీసు బందోబస్తు నడుమ వచ్చాయి.

Published : 31 Mar 2023 02:38 IST

ప్రశ్నపత్రాల తరలింపును పర్యవేక్షిస్తున్న డీఆర్వో రాజశేఖర్‌, డీఈవో విజయేంద్రరావు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: సార్వత్రిక పాఠశాలల్లోని పదో తరగతి, ఇంటర్‌మీడియేట్‌ పరీక్షల ప్రశ్న పత్రాలు గురువారం విజయవాడ నుంచి చిత్తూరుకు పోలీసు బందోబస్తు నడుమ వచ్చాయి. వీటిని డీఆర్వో రాజశేఖర్‌ పర్యవేక్షణలో డీఈవో విజయేంద్రరావు, అధికారులు.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. తర్వాత జిల్లాలోని సార్వత్రిక పాఠశాల పరీక్ష కేంద్రాల్లో పదో తరగతికి సంబంధించి ఆరు, ఇంటర్‌మీడియేట్‌కి సంబంధించి 15 కేంద్రాల పరిధిలోని పోలీసు స్టేషన్లకు ప్రత్యేక వాహనాల్లో వాటిని తరలించి అక్కడ భద్రపరిచారు. పదో తరగతి పరీక్ష 1,102మంది, ఇంటర్మీడియేట్‌ 3,557మంది ఏప్రిల్‌ 3నుంచి 17వరకు రాయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని