logo

ఐఐటీలో తిరు ఉత్సాహం

ఆత్మీయత.. ఆనంద మేళవింపుతో ఏటా నిర్వహిస్తూ వస్తున్న తిరు ఉత్సవ్‌కు తిరుపతి ఐఐటీలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే సాంకేతిక పండుగతో (టెక్నో ఫెస్ట్‌) సందడి ప్రారంభమైంది.

Published : 31 Mar 2023 02:33 IST

నేటి నుంచి టెక్నో.. కల్చరల్‌ ఫెస్ట్‌

తిరు ఉత్సవ్‌కు సిద్ధమైన ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: ఆత్మీయత.. ఆనంద మేళవింపుతో ఏటా నిర్వహిస్తూ వస్తున్న తిరు ఉత్సవ్‌కు తిరుపతి ఐఐటీలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే సాంకేతిక పండుగతో (టెక్నో ఫెస్ట్‌) సందడి ప్రారంభమైంది. బోధనలన్నీ పక్కన పెట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతో మమేకమై నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మేధస్సును పెంచడంతో పాటు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పంచేందుకు తిరుపతి ఐఐటీ వేదిక కావడం విశేషం. గతేడాది కంటే ఎంతో నవ్యతతో కూడిలన వర్క్‌షాప్‌లు, క్రీడలు, ఫ్యాషన్‌షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలతో విద్యార్థులు సందడి చేసేందుకు సిద్ధం కావడం విశేషం.

ప్రత్యేకతలివీ..: విద్యార్థులకు చదువొక్కటే కాకుండా సాంస్కృతిక సరదాలు చేసుకునే సౌలభ్యం కల్పించడం తిరు ఉత్సవ్‌ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఐఐటీ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ నెల 1, 2 తేదీల్లో ఈ సాంకేతికత మేళవింపుతో సాంస్కృతిక పండుగలు నిర్వహిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలతో నూతన ఒరవడి సృష్టించిన ప్రయోగాలు, ట్రీసర్‌హంట్‌, వంటల పోటీ, బ్రిడ్జిబాజోక్‌ సాంకేతిక క్రీడ, సర్‌గామ్‌, క్రైంబస్టర్స్‌, కథలు, రచనలు, కేటీఎం బైక్‌ షో తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 31వ తేదీన నిర్వహించే ప్రారంభోత్సవ సమావేశానికి అమరరాజా బ్యాటరీస్‌ ప్రధాన సాంకేతిక విభాగం అధికారి ఎం.జగదీష్‌, కిన్‌డ్రిల్‌ ప్రిన్సిపల్‌ షీలాసిద్ధప్ప ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నట్లు ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.


సాంకేతికత కొత్త పుంతలు

- శ్యామల్‌, టెక్నికల్‌ అఫైర్స్‌ సెక్రెటరీ

సమాజహితం ప్రధాన లక్ష్యంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కే విధంగా ఈ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేశాం. నిర్వహిస్తున్న ఈవెంట్లు అన్నీ మేధస్సును పెంచే విధంగా శాస్త్ర సాంకేతికతకు అద్దం పట్టే విధంగా సిద్ధం చేశాం.


మానసిక ఉల్లాసం కోసం..

- పవన్‌, కల్చరల్‌ అఫైర్స్‌ సెక్రెటరీ

చదువుతో పాటు మానసిక ఉల్లాసం లక్ష్యంగా ఈ తిరు ఉత్సవ్‌ వేడుకలు జరుపుతున్నాం. పదిమంది విద్యార్థులతో సంఘంగా ఏర్పడి వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.


ఈవెంట్లలో పోటీలు

- మహేష్‌, ప్రోగాం అధికారి

విద్యార్థుల ఆనందమే లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారు. తిరుపతి ఐఐటీ ద్వారా నిర్వహించే పలు ఈవెంట్లల్లో పోటీ పడుతున్నారు. విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంచడమన్నది తిరుఉత్సవ్‌ ప్రధాన లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని