logo

బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి రోజా

శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీకోదండరామాలయంలోని శ్రీసీతారాములకు మంత్రి ఆర్‌కే రోజాసెల్వమణి దంపతులు గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. 

Published : 31 Mar 2023 02:33 IST

శ్రీసీతారాములకు పట్టువస్త్రాల సమర్పణ

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి ఆర్‌కే రోజాసెల్వమణి దంపతులు

పుత్తూరు, న్యూస్‌టుడే: శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీకోదండరామాలయంలోని శ్రీసీతారాములకు మంత్రి ఆర్‌కే రోజాసెల్వమణి దంపతులు గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక కార్వేటినగరం రోడ్డులోని మండపం నుంచి ఊరేగింపుగా వెళ్లి వాటిని అందజేశారు. ఆలయ ఈవో మునికృష్ణయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు.. మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వారిని వేదమంత్రాలతో పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించా లన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ హరి, వైస్‌ ఎంపీపీ మునస్వామిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి, కౌన్సిలర్లు భానుమతి, నరసింహారావు, ఏకాంబరం, జాన్‌కెనడీ, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని