logo

వరసిద్ధుడి దర్శనం పూర్వజన్మ సుకృతం

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం స్వామివారిని దర్శించుకుని స్థానిక విలేకరులతో మాట్లాడారు.

Published : 31 Mar 2023 02:33 IST

మంత్రి రాంబాబుకు జ్ఞాపిక అందిస్తున్న ఎమ్మెల్యే బాబు, ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం స్వామివారిని దర్శించుకుని స్థానిక విలేకరులతో మాట్లాడారు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకుని ఆపై ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాబు, ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, అర్చకులు రాజగోపురం వద్ద మంత్రి, కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలను అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. మంత్రి వెంట చిత్తూరు ఎమ్మెల్యే ఎ.శ్రీనివాసులు, ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ అధికారులు, వైకాపా నాయకులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని