logo

ఎన్టీఆర్‌ పేరు.. తెలుగుజాతి ఉన్నంత వరకూ చెక్కుచెదరదు

తెలుగుజాతిని ప్రభావితం చేసిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)కి భారతరత్న పురస్కారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌ కోరారు.

Published : 31 Mar 2023 02:33 IST

పురస్కార గ్రహీతలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌,  దేవేంద్రరావు తదితరులు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలుగుజాతిని ప్రభావితం చేసిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)కి భారతరత్న పురస్కారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌ కోరారు. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ‘తెలుగుజాతి అక్షరం. తెలుగువారి ఆత్మగౌరవం’ అనే అంశంపై గురువారం చిత్తూరులోని రెడ్డి భవన్‌లో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరుణకుమార్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఉద్యోగ జీవితం ప్రారంభమైన తొలినాళ్లలో కోర్టులో ఉద్యోగానికీ ఎంపికయ్యారన్నారు. ఆత్మగౌరవ నినాదంతో దేశ రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించారని, తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసు కొచ్చారన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలందరికీ సంబంధించిన మహామనిషి ఎన్టీఆర్‌ అని అభివర్ణించారు. సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి అంటే ఎన్టీఆర్‌కు అమిత ఇష్టమన్నారు. ఆయన పాలనలో ప్రభుత్వ పథకాలు, కార్యాలయాలకు తెలుగులోనే పేర్లు పెట్టారని గుర్తుచేశారు. సామాజిక సేవకురాలు తులసినెహ్రూకి స్త్రీ శిరోరత్న పురస్కారం, రచయిత నందిపాటి చక్రపాణికి సేవారాజన్మణి పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాలకు చెందిన శాంతకుమారి, వెంకటరత్నం, లావణ్య, సోము ఉమాపతి, రఘుపతి, గోవిందయ్య, గోవిందన్‌, నేతాజీ, బాలరాజు, మొగిలయ్యశెట్టి, హరిప్రసాద్‌ కు పురస్కారాలు అందజేశారు. సమాఖ్య గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని