logo

సాహిత్యం సమాజానికి దిక్సూచి

సాహిత్యం సమాజానికి దిక్సూచి లాంటిదని జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి అన్నారు. కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ రామలక్ష్మి అధ్యక్షతన సాహితీవేత్తలకు పురస్కారాల

Published : 31 Mar 2023 02:33 IST

ఘనంగా కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ప్రదానం


కుప్పం రెడ్డమ్మ పురస్కారం అందుకుంటున్న ఆముదాల మురళి

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: సాహిత్యం సమాజానికి దిక్సూచి లాంటిదని జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి అన్నారు. కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ రామలక్ష్మి అధ్యక్షతన సాహితీవేత్తలకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గురువారం నగరంలోని ఓ ప్రైవేట్‌ హాల్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒక్క సిరా చుక్కా కోటి మెదళ్లను మేల్కొల్పుతుందని చెప్పారు. తెలుగు భాషను సంరక్షించుకుంటూ.. సమాజహితం కోసం సాహితీవేత్తలు తమ రచనల్ని కొనసాగించాలన్నారు. చందో పద్య కవిత్వ ప్రక్రియలో ఆముదాల మురళికి, వచన కవిత్వ ప్రక్రియలో నవజీవన్‌రెడ్డికి, కథానిక ప్రక్రియలో ఉమాదేవి, ఝాన్సీలకు సంయుక్తంగా పురస్కారాలు ప్రదానం చేశారు. దీంతోపాటు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు బహుమతి అందజేశారు. రచయితలు మల్లేశ్వరరావు, కృష్ణమూర్తి, మునస్వామి, అరుణ కుమారి, సహదేవనాయుడు, డాక్టర్లు రోజాప్రియ, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని