logo

ఉద్యోగ నియామకాలపై సీఐడీ విచారణ చేయాలి

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగ నియామకాలపై సీఐడీ విచారణ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరిప్రసాద్‌, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 31 Mar 2023 02:33 IST

సీఐడీకి రాసిన లేఖను చూపుతున్న తెదేపా నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగ నియామకాలపై సీఐడీ విచారణ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరిప్రసాద్‌, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ డిమాండ్‌ చేశారు. సీఐడీకి రాసిన లేఖను స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో చూపారు. వారు మాట్లాడుతూ సహకార బ్యాంకులో ఇటీవల 55 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించారని, నియామకాల్లో 80 శాతం ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. బ్యాంకులో కొందరు అనధికార వ్యక్తులు, రాజకీయ నాయకులు, డైరెక్టర్లు కలిసి ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. 40 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 15 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు భర్తీలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, డబ్బులు చేతులు మారాయని చెప్పారు. జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్‌ రాజ్‌, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్‌కుమార్‌ చౌదరి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి జైపాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని