logo

విశ్రాంత వీఆర్వోపై దురుసుగా ప్రవర్తించారని ధర్నా

విశ్రాంత వీఆర్వో రవీంద్రనాధరెడ్డి కుమారుడు ఆదర్స్‌ గురువారం రాత్రి సమీప మామిడితోటకు వెళ్లి ఇంటికి వస్తుండగా, వాహన తనిఖీలో  భాగంగా ఎస్సై ఆపారు.

Published : 31 Mar 2023 02:33 IST

స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

జీడీనెల్లూరు: విశ్రాంత వీఆర్వో రవీంద్రనాధరెడ్డి కుమారుడు ఆదర్స్‌ గురువారం రాత్రి సమీప మామిడితోటకు వెళ్లి ఇంటికి వస్తుండగా, వాహన తనిఖీలో  భాగంగా ఎస్సై ఆపారు. వెనుక వస్తున్న రవీంద్రనాథరెడ్డి.. తామూ ఇదే గ్రామస్థులమని, తాను విశ్రాంత వీఆర్వోనని చెప్పినా పట్టించుకోకుండా దురుసుగా వ్యవహరించి వారిని ఎస్సై బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆగ్రహించిన గ్రామస్థులు, వైకాపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై.. విశ్రాంత వీఆర్వో భార్యకు క్షమాపణ చెప్పినా, రెండు గంటలపాటు ధర్నాతో రాకపోకలు నిలిచాయి. విశ్రాంత వీఆర్వో తమ్ముడు, రాష్ట్ర గ్రీనరీ బోర్డు డైరెక్టర్‌ గుణశేఖర్‌రెడ్డి వచ్చి ఎస్సై, పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసరెడ్డి వచ్చి విశ్రాంత వీఆర్వో, వైకాపా నేత, ఆందోళనకారులతో చర్చించి ఎస్సైపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని