logo

పోలీసుల తీరు అప్రజాస్వామికం: జనసేన

ఏర్పేడు మండలం చిందేపల్లికి సంబంధించిన రోడ్డు కోసం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినుత చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసి..

Published : 31 Mar 2023 02:32 IST

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: ఏర్పేడు మండలం చిందేపల్లికి సంబంధించిన రోడ్డు కోసం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినుత చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసి.. నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో హరిప్రసాద్‌తోపాటు తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల జనసేన ఇన్‌ఛార్జులు కిరణ్‌ రాయల్‌, వినుత మాట్లాడారు. రోడ్డు ఆక్రమణపై ప్రశ్నించిన గ్రామ ప్రజలపై కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మద్దతుగా నిలిచిన జనసేన నాయకులపై పోలీసులు లాఠీలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఘటనను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైతే ఆయన గ్రామ ప్రజలకు  మద్దతుగా హాజరవుతారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని