logo

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు తగదు

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై విధించిన అనర్హత వేటును తక్షణమే ఎత్తివేయాలని కాంగ్రెస్‌ నేత శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 31 Mar 2023 02:32 IST

వెంకటగిరి: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై విధించిన అనర్హత వేటును తక్షణమే ఎత్తివేయాలని కాంగ్రెస్‌ నేత శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పోలేరమ్మ ఆర్చి వద్ద గురువారం నిరసన తెలిపారు. భాజపా ప్రభుత్వ అరాచకాలు, అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటాన్ని పార్లమెంటులో అనునిత్యం రాహుల్‌ గాంధీ ప్రశ్నిస్తుండటంతోనే భాజపా ప్రభుత్వం వేటు వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని