logo

స్కేటింగ్‌ రింక్‌ ప్రైవేటీకరణ నిలుపుదల

తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో స్కేటింగ్‌ రింక్‌  ప్రైవేటీకరణకు ఆహ్వానించిన టెండర్‌ను నిలిపివేశారు. టెన్నిస్‌ కోర్టు, స్కేటింగ్‌ రింక్‌లను శాప్‌ బహిరంగ వేలానికి టెండర్లు ఆహ్వానించడంపై ఈ నెల 28న

Updated : 31 Mar 2023 04:49 IST

తిరుపతి (క్రీడలు): తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో స్కేటింగ్‌ రింక్‌  ప్రైవేటీకరణకు ఆహ్వానించిన టెండర్‌ను నిలిపివేశారు. టెన్నిస్‌ కోర్టు, స్కేటింగ్‌ రింక్‌లను శాప్‌ బహిరంగ వేలానికి టెండర్లు ఆహ్వానించడంపై ఈ నెల 28న ‘ఈనాడు’లో ‘ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. జాతీయ స్థాయి స్కేటింగ్‌ పోటీలకు శిక్షణ పొందుతున్న క్రీడాకారుల తల్లిదండ్రులు శాప్‌ ఎండీ హర్షవర్దన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. స్కేటింగ్‌ ద్వారా ఆన్‌ సిజన్‌లో నెలకు రూ.50వేలు, వేసవిలో నెలకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తోంది. ప్రైవేటీకరణ ద్వారా నెలకు రూ.40వేలే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని