logo

జీతాలెప్పుడొస్తాయో?

ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెలకు సంబంధించి చెల్లించాల్సిన జీతాలు ఈ నెలలో ఏ రోజున జమవుతాయో అని ఉద్యోగ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఏప్రిల్‌ 1 శనివారం బ్యాంకుల క్లోసింగ్‌ డే. 2న ఆదివారం సెలవు.

Published : 01 Apr 2023 03:13 IST

మూడో తేదీ తర్వాతే స్పష్టత

చిత్తూరు కలెక్టరేట్‌: ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెలకు సంబంధించి చెల్లించాల్సిన జీతాలు ఈ నెలలో ఏ రోజున జమవుతాయో అని ఉద్యోగ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఏప్రిల్‌ 1 శనివారం బ్యాంకుల క్లోసింగ్‌ డే. 2న ఆదివారం సెలవు. మూడో తేదీన మళ్లీ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే జీతాల చెల్లింపులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి జీతాలు మార్చిలో సకాలంలో జమయినట్లు ఉద్యోగ వర్గాలు భావించాయి. అయితే ఫిబ్రవరి తరహాలో ఈ నెలలో అలాగే జమవుతాయా లేదా అని ఆరా తీస్తున్నారు. ఏడాది కాలంగా ప్రతినెలా 20వ తేదీ దాటినా వేతనాలు జమకాని పరిస్థితిని ఉద్యోగ వర్గాలు చవిచూశాయి. జిల్లాలో 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రతి నెలా 25వ తేదీ నాటికి ఉద్యోగుల వేతనాల బిల్లుల్ని ఖజానా శాఖకు అందిస్తారు. వాటి పరిశీలన అనంతరం సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకటో తేదీ నుంచి వేతనాల చెల్లింపులు జరుగుతాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 27వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో డీడీవోలు, ఖజానా అధికారులు వేతన బిల్లుల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీరామనవమి పండుగ రోజున సైతం బిల్లుల రూపకల్పన విధుల్ని నిర్వర్తించారు. బిల్లుల సమర్పణకు చివరి రోజైన శుక్రవారం సైతం అధికారులు హడావుడిగా కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని