logo

పునరావాస కేంద్రాలపై విజి‘లెన్స్‌’

ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పునరావాస కేంద్రాల (స్త్రీలు, వృద్ధులు, ఆడ పిల్లలు, వికలాంగులు, బిచ్చగాళ్లు, మత్తు బానిసల కేంద్రాలు) పై విజిలెన్స్‌ సోదాలు నిర్వహించింది.

Published : 01 Apr 2023 03:13 IST

చిత్తూరు వికాస్‌ విహార్‌ డే కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

తిరుపతి(నేరవిభాగం): ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పునరావాస కేంద్రాల (స్త్రీలు, వృద్ధులు, ఆడ పిల్లలు, వికలాంగులు, బిచ్చగాళ్లు, మత్తు బానిసల కేంద్రాలు) పై విజిలెన్స్‌ సోదాలు నిర్వహించింది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని నాలుగు బృందాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, సత్యవేడు, వడమాలపేట, మంగళంతోపాటు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మౌలిక వసతుల కల్పన.. ప్రభుత్వ నిధుల వినియోగం.. అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. కొన్ని చోట్ల అగ్నిమాపక యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదని, కొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తు న్నారని, రికార్డులు సక్రమంగా నమోదు చేయడం లేదని గుర్తించారు. నిరంతరం సోదాలు కొనసాగుతాయని వసతులు మెరుగుపరచాలని ఈశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని