logo

ఆయుర్వేద ఔషధ కేంద్రం ప్రారంభం

నరశింగాపురంలోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో నూతనంగా నిర్మించిన ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం  ప్రారంభించారు.

Published : 01 Apr 2023 03:13 IST

యంత్రంలో ఆయుర్వేద చూర్ణం వేస్తున్న తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి

చంద్రగిరి(గ్రామీణ): నరశింగాపురంలోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో నూతనంగా నిర్మించిన ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం  ప్రారంభించారు. ప్రస్తుతం కేంద్రంలో తొలివిడతగా 10 రకాల ఔషధాలు తయారు చేస్తారన్నారు. భవిష్యత్తులో 314 రకాల ఔషధాలు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జేఈవో సదా భార్గవి, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఆయుర్వేద] ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్‌, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుందరం, ఈఈ మురళీకృష్ణ, వీజీవో మనోహర్‌, ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్‌ నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని