logo

కుర్చీలు లేక.. ఎండలో నిలబడలేక..

పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ గందరగోళంగా సాగింది. మహిళలకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక.. గంటల తరబడి మండుటెండలో నిలబడాల్సి వచ్చింది.

Published : 01 Apr 2023 03:13 IST

సమావేశం ప్రారంభం కాకముందే ఇంటి ముఖం పడుతున్న మహిళలు ‌

పూతలపట్టు(ఐరాల), న్యూస్‌టుడే: పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ గందరగోళంగా సాగింది. మహిళలకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక.. గంటల తరబడి మండుటెండలో నిలబడాల్సి వచ్చింది. నిలబడలేని వృద్ధులు ఇంటికి వెళ్దామంటే గేట్లు వేశారు. చెమటలు కక్కుకుంటూ మోకాళ్లు పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. కొందరైతే ఈ డబ్బు మాకొద్దు.. ఈ కష్టం మాకొద్దు అని సభ ప్రారంభం కాకముందే ఇంటి ముఖం పట్టారు. వాలంటీర్లు ఇంటి వద్ద సమావేశానికి వెళ్లి అక్కడ సంతకాలు పెట్టిన వారికే అసరా డబ్బులు పడతాయని చెప్పడంతో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చేశారు.  ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు మాట్లాడుతుండగా అప్పటికే విసిగిపోయిన మహిళలు బలవంతంగా గేట్లు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంట పాటు ఓపిక పట్టలేరా అని అన్నారు. నాయకులు అధికారులు మైకుల్లో అరుస్తున్నా మహిళలు మాత్రం పట్టించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని