logo

అడవి పందుల వేట కేసులో ఆరుగురి అరెస్ట్‌

తమతో పాటు వేటకు వచ్చిన సహచరుడు ఆకస్మికంగా విద్యుదాఘాతానికి గురై మరణించగా.. అతడి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురిని అరెస్ట్‌ చేసి రిమాండు తరలించినట్లు కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం స్థానిక విలేకరులకు వివరించారు.

Published : 01 Apr 2023 03:13 IST

నిందితులతో కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై వెంకటేశ్వర్లు

ఐరాల, న్యూస్‌టుడే: తమతో పాటు వేటకు వచ్చిన సహచరుడు ఆకస్మికంగా విద్యుదాఘాతానికి గురై మరణించగా.. అతడి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురిని అరెస్ట్‌ చేసి రిమాండు తరలించినట్లు కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం స్థానిక విలేకరులకు వివరించారు. వివరాలు ఇలా.. బెస్తపల్లెకు చెందిన జి.సుబ్రహ్మణ్యం, జి.శ్రీనివాసులు, నందయ్య, వడ్డిపల్లెకు చెందిన ఎ.రెడ్డెప్ప, పి.సుబ్రహ్మణ్యం, ఎం.చిన్నబ్బ, బి.వీరభద్రలు మంగళవారం అడవి పందుల వేటకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్తు తీగలను అమర్చారు. ప్రమాదవశాత్తు బెస్తపల్లెకు చెందిన జి.సుబ్రహ్మణ్యం విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని మిగిలిన ఆరుగురు మాయం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై గురువారం కేసు నమోదు చేశారు. వైఎస్‌ గేటు బస్టాపు వద్ద ఉన్న నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండు తరలించినట్లు  వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని