logo

రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి

ఐదున్నరేళ్ల పాటు వైద్యవిద్యను అభ్యసించి పూర్తిస్థాయి వైద్యులుగా సమాజంలోకి వెళుతున్న మీరు పేద, గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌ పిలుపునిచ్చారు.

Published : 01 Apr 2023 03:13 IST

గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో ఎస్వీఎంసీ ప్రిన్సిపల్‌

జ్యోతి వెలిగిస్తున్న వైద్యాధికారులు

తిరుపతి(వైద్యం), న్యూస్‌టుడే: ఐదున్నరేళ్ల పాటు వైద్యవిద్యను అభ్యసించి పూర్తిస్థాయి వైద్యులుగా సమాజంలోకి వెళుతున్న మీరు పేద, గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎస్వీఎంసీ భువన విజయం ఆడిటోరియంలో 2017వ సంవత్సరం వైద్య విద్యార్థులకు 58వ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం 225 మంది విద్యార్థులకు వైద్య పట్టాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సంఘంలో మంచి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకుని ఎస్వీఎంసీ కీర్తిని ఇనుమడింపజేయాలని కోరారు. కొవిడ్‌ సందర్భంగా ఎనలేని సేవలు అందించిన బ్యాచ్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు. కార్యక్రమంలో పూర్వపు ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ రామసుబ్బారెడ్డి, డాక్టర్‌ హరినాథ్‌, డాక్టర్‌ బలరామరాజు, డాక్టర్‌ వాసుదేవరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్‌ సునందకుమార్‌రెడ్డి, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమునీంద్రుడు, డాక్టర్‌ సురేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని